గుజరాత్ మాడల్ భ్రమే
గుజరాత్ మాడల్ అంటూ దేశంలో జరిగిన ప్రచారం వట్టి భ్రమేనని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. అక్కడ జరిగింది గోరంత అయితే చెప్పుకొన్నది కొండంతని విమర్శించారు.
- ప్రజల కోణంలో పార్టీలు పనిచేయలి
- టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు
హైదరాబాద్, అక్టోబర్ 5, (నమస్తే తెలంగాణ): గుజరాత్ మాడల్ అంటూ దేశంలో జరిగిన ప్రచారం వట్టి భ్రమేనని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. అక్కడ జరిగింది గోరంత అయితే చెప్పుకొన్నది కొండంతని విమర్శించారు. గుజరాత్ వృద్ధిరేటు 1.25% శాతం పెరిగితేనే అదో పెద్ద గొప్పగా చెప్పుకొన్నారని, అది జీడీపీలో 0.25% కూడా లేదని వివరించారు. తెలంగాణ సాధించిన విజయం అద్భుతమైనదని, దేశంలో అత్యధిక వృద్ధిరేటును తెలంగాణ నమోదు చేసిందని చెప్పారు.
రాజకీయాల గురించి ప్లేటో మొదలుకొని కారల్‌మార్క్స్ వరకు అనేక మందిచెప్పారని, సమాజానికి ఉపయోగపడేదే రాజకీయమని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయని, వాటిలో టీఆర్ఎస్ ఒక్కటే తన ప్రత్యేకతను నిలబెట్టుకొన్నదని గుర్తుచేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ శుభపరిణామమని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బాగుంటుందని, దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని తాము కలలుగన్నామని, కేసీఆర్ నాయకత్వంలో అది సాధ్యమైందని కేశవరావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

