ఈటల ప్రలోభాలకు లొంగే వారెవరూ లేరు : గందే రాధిక
గందే రాధిక | హుజురాబాద్ నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనలేరనే విషయాన్ని మాజీమంత్రి ఈటల రాజేందర్ గ్రహించాలని హుజురాబాద్

కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో డబ్బులు వెదజల్లి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనలేరనే విషయాన్ని మాజీమంత్రి ఈటల రాజేందర్ గ్రహించాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ గందే రాధిక పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాధిక మాట్లాడారు. ఈటల రాజేందర్ గత మూడు రోజులుగా తన అనుచరులను కొంతమంది నాయకుల వద్దకు పంపి డబ్బులు ఆశ చూపి తన వైపు లాక్కోవాలనుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఈటల ప్రలోభాలకు లొంగే వారేవరూ లేరని ఆమె స్పష్టం చేశారు.
రాజకీయ భవిష్యత్‌ను ఇచ్చిన సీఎం కేసీఆర్‌ను ఈటల విమర్శించడం సరికాదన్నారు. తనకు 200 ఎకరాల భూమి ఉందని, ఒక్కో ఎకరం అమ్మి ఒక్కో ఎన్నికను ఎదుర్కొంటానని ఈటల ప్రకటించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ టీఆర్ఎస్ వెంటే ఉన్నారని గందే రాధిక స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

