కరెంట్ కోతలపై గిరిజనుల కన్నెర్ర
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గొల్లకుంట తండాలో నెల రోజులుగా విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో గిరిజనులు మండిపడుతున్నారు.
- సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు
- మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఘటన
- పెద్దపల్లి జిల్లా మంథనిలో మహిళల ధర్నా
అల్లాదుర్గం/మంథని, జూలై 13 : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గొల్లకుంట తండాలో నెల రోజులుగా విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో గిరిజనులు మండిపడుతున్నారు. కరెంట్ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోక పోవడంతో శనివారం అల్లాదుర్గం సబ్‌స్టేషన్ ఎదుట 161వ జాతీయ రహదారిపై బైఠాయించారు. దాదాపు అరగంటపాటు రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా తండా వాసులు మాట్లాడుతూ.. రెప్పపాటు కరెంట్ కోతలు ఉండకూడదని ప్రభుత్వ ఆదేశాలను విద్యుత్తు అధికారులు బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. గొల్లకుంట తండాలో నెల రోజులుగా విద్యుత్తు కోతలు విధిస్తున్నారని, రాత్రిపూట కూడా కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతుండటంతో దొంగతనాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఎస్సై దేవిదాస్ వచ్చినా సముదాయించినా భీష్మించుకు కూర్చున్నారు. వెంటనే ఆయన విద్యుత్తు అధికారులతో ఫోన్లో మాట్లాడగా ఆయన హామీ మేరకు ఆందోళన విరమించారు.
మంథనిలో కాకరపల్లి మహిళల ధర్నా
విద్యుత్తు సరఫరా నిలిపి వేశారంటూ పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లికి చెందిన దళిత మహిళలు ఆందోళనకు దిగారు. శనివారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళిత కాలనీకి చెందిన తమకు కరెంట్ మీటర్లు లేవని, తీగల ద్వారా విద్యుత్తును తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు దౌర్జన్యంగా కరెంట్ తీగలను ఇష్టంవచ్చినట్టు కట్ చేశారని మండిపడ్డారు. ఏఈ రాజమల్లయ్యను స్పందిస్తూ.. కాకర్లపల్లిలోని ఎస్సీ కాలనీ వాసులకు విద్యుత్తు మీటర్లు లేవని అన్నారు. అక్రమంగా విద్యుత్తు వాడుకుంటున్నందున తమ సిబ్బంది వెళ్లి తీగలను తొలగించారని, ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

