స్వరాష్ట్రంలోనే ఆదివాసీల స్వయంపాలన

- త్వరలో పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం
- ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం శుభాకాంక్షలు
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలోనే ఆదివాసీల స్వయంపాలన సాధ్యమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ ఆదివాసీలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం,ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. వారి గూడేలు, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని గుర్తుచేశారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఆదివాసీ, గోండు గూడేలకు కూడా స్వచ్ఛమైన తాగునీరును అందిస్తున్నామని చెప్పారు. ఆదివాసీ బిడ్డల విద్యకోసం ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేశామని, ఐఏఎస్ స్టడీ సరిల్తోపాటు, వారికి ప్రత్యేకంగా స్పోర్ట్స్ కాలేజీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వారి ఇండ్లకు 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిషారం చూపించనున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నా రు. ఆదివాసీల సంస్కృతిని చాటేలా నిర్మించుకొన్న కుమ్రంభీం భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని, ట్యాంక్‌బండ్‌పై ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటుచేసుకొని ఘనంగా నివాళి అర్పించుకొన్నామని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో మ్యూజియంలు ఏర్పాటుచేసుకొన్నామని, తుపాకులగూడెం బరాజ్‌కు సమ్మక్క పేరు పెట్టుకొన్నామని గుర్తుచేశారు. ఆదివాసీల దేవతలైన సమ్మక – సారలమ్మ సహా.. నాగోబా, సేవాలాల్ మహరాజ్ జాతరలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆదివాసీలు సేకరించే తేనె తదితర అటవీ ఉత్పత్తులకు గిరిబ్రాండ్ పేరుతో మారెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న ఆదివాసీ బిడ్డల కోసం, ‘గిరిపోషణ్’ పేరుతో పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అం దిస్తున్నదని తెలిపారు. సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పథకం కింద ఆదివాసీ గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు ప్రత్యేక చర్య లు చేపట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

