పున: ప్రారంభానికి గిరిజన గురుకుల, ఆశ్రమ పాఠశాలలను సన్నద్దం చేయాలి

హైదరాబాద్ : సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రత్యక్ష పద్దతిలో పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సన్నద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యాసంస్థల పున: ప్రారంభంపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం నగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కోవిడ్ వల్ల పాఠశాలలు మూత పడడంతో చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారన్నారు. విద్యా సంస్థలు పున: ప్రారంభం కావడంతో విద్యార్థులందరినీ చేర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలని చెప్పారు. గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడాలలో ఉండే గిరిజనుల ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలన్నారు. ఏ ఒక్కరు పాఠశాలలో చేరకుండా ఉండొద్దు అని చెప్పారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి సెప్టెంబర్ లో పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలన్నారు. 15 రోజుల పాటు జరిగే గిరిదర్శిని కార్యక్రమంలో ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొని, విద్యార్థుల భవిష్యత్ కోసం అంకితభావంతో కృషి చేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న అంగన్ వాడీ ఉద్యోగుల సేవలను ఇందుకోసం వినియోగించుకోవాలని, గ్రామాల్లోని ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అంగన్వాడీలతో సమన్వయం చేసుకోవాలన్నారు.

కోవిడ్ వల్ల మూతపడ్డ విద్యా సంస్థలలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించి, కావల్సిన మరమ్మత్తులను వెంటనే చేపట్టాలన్నారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లకు 20 వేల రూపాయల చొప్పున విడుదల చేయాలన్నారు. ఆహార పదార్థాలకు, కాస్మొటిక్స్ కొరత లేకుండా గిరిజన కో ఆపరేటివ్ కార్పోరేషన్(జీసీసీ) ద్వారా సమన్వయం చేయాలన్నారు.
విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు నడిచే విధంగా హెల్త్ కమాండ్ సెంటర్ ను నిర్వహించాలన్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. శానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కావల్సిన పాఠ్యపుస్తకాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, గిరిజన గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, విజయలక్ష్మీ, లక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

