తెలుగు రాష్ట్రాల్లోనే పంచకర్మ చికిత్సలో ది బెస్ట్‌గా నిలుస్తోంది ట్రావెన్కోర్ ఆయుర్వేద క్లినిక్. 2015లో రెండు క్లినిక్‌లతో ప్రారంభమై ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా 11 క్లినిక్‌లు, 2 ఫార్మసీలతో రోగులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్నది. ఇందులో 16 మంది అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులతో సహా 150 మందితో కూడిన బృందం వైద్యసేవలు అందిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ (ఎన్ఏబీహెచ్) గుర్తింపు పొందిన మొదటి ఆయుర్వేద క్లినిక్ కావడం విశేషం.
ట్రావెన్కోర్ ఆయుర్వేద క్లినిక్ ఉత్తమమైన పంచకర్మ చికిత్సలకు ప్రసద్ధిగాంచింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకున్నది. ఆయుర్వేద నిపుణుల ప్రశంసలు పొందింది.
ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్ కోసం ఐటీ ప్లాట్‌ఫాం సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రావెన్కోర్ ఆయుర్వేదం (ఎస్ఐటీఏ) ఉపయోగిస్తున్న ఏకైక ఆయుర్వేద క్లినిక్ ఇదే. డిజిటల్ సమీక్షల్లో ఉత్తమ రేటింగ్ పొందింది. అలాగే, సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా ఆయుర్వేదంపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నది.
ట్రావెన్కోర్ ఆయుర్వేద క్లినిక్ యూట్యూబ్ చానల్లో వెయ్యి మంది రోగుల టెస్టిమోనియల్స్, వివిధ అంశాలపై దాదాపు 200కు పైగా వీడియోలున్నాయి. సొంత బ్రాండ్‌పై సాంప్రదాయ ఔషధాలను తయారుచేస్తున్నది. ఈ ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా 1 ఎంజీలతోపాటు అన్ని క్లినిక్‌లు, ప్రసిద్ధ ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. దేశంలోనే మొదటి ఆయుర్వేద గార్గిల్ పౌడర్ ‘గలశోధక్’ను ట్రావెన్కోర్ ఆయుర్వేద క్లినిక్ తయారు చేసింది. ప్రజలకు అందుబాటులో ఉంచింది. త్వరలోనే డే కేర్ థెరపీల కోసం ఆయుర్వేద చికిత్స ఖర్చులకు బీమా సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ‘ట్రావెన్కోర్ ఆయుర్వేద క్లినిక్.. బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకోనుంది.
ఈ ట్రావెన్కోర్ ఆయుర్వేద క్లినిక్‌లు ఆయుర్వేద రంగంలో 16 ఏళ్ల అనుభవమున్న డాక్టర్ స్మిత కత్తిగోటూరు (బీఏఎంఎస్) ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి. డాక్టర్ స్మిత.. ఆయుర్వేద ప్రయోజనాలను ప్రపంచానికి అందించాలనే తపనతో పనిచేస్తున్నారు. ఆమె ఆయుర్వేదంలో నిష్ణాతురాలు. ట్రావెన్కోర్ ఆయుర్వేదంలో అనుభవజ్ఞులైన వైద్యుల ప్యానెల్‌కు ఈమె నాయకత్వం వహిస్తున్నారు. ప్రాక్టీస్, గవర్నెన్స్ హెడ్‌గా ఉన్నారు.
చర్మవ్యాధులు, ఆస్టియో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, అప్పర్ రెస్పిరేటరీ వ్యాధులు, ప్రసవానంతర సంరక్షణ (మాతృరక్ష), కీళ్ల నొప్పులు, బరువు నిర్వహణ, ఒత్తిడి సంబంధిత వ్యాధుల చికిత్సలో డాక్టర్ స్మిత చాలా సంవత్సరాల నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. ఆమె పబ్లిక్ స్పీకర్, బ్లాగర్. వివిధ విషయాలపై వెబినార్లు నిర్వహించారు. ప్రజల ప్రయోజనం కోసం వివిధ వ్యాధులపై చాలా ఉపయోగకరమైన, ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ వీడియోలను కూడా విడుదల చేశారు.
1. మదీనాగూడ (హైదరాబాద్)
2. గచ్చిబౌలి (హైదరాబాద్)
3. సైనిక్‌పురి (హైదరాబాద్)
4. జూబ్లీహిల్స్ (హైదరాబాద్)
5. నల్లగండ్ల (హైదరాబాద్)
6. మారేడ్‌పల్లి (హైదరాబాద్)
7. దాసపల్ల హిల్స్ (విశాఖపట్నం)
8. ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం)
9. సిద్ధార్థకాలనీ (విజయవాడ)
10. జయనగర్ (బెంగళూరు)
11. సీవీ రామన్ నగర్ (బెంగళూరు)