మద్యం తాగుతూ విధులు.. ఉద్యోగి తొలగింపు
మహబూబాబాద్ జిల్లాలో మద్యం తాగుతూ విధులు నిర్వహించిన ఘటనపై రవాణాశాఖ తీవ్రంగా స్పందించింది.
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లాలో మద్యం తాగుతూ విధులు నిర్వహించిన ఘటనపై రవాణాశాఖ తీవ్రంగా స్పందించింది. రవాణాశాఖ కార్యాలయంలో బీరు తాగుతూ విధులు నిర్వహించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు అతడి పేరును బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యుడిగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి, ఎంవీఐ ఎండీ గౌస్‌పాషాకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమో జారీ చేశారు. కార్యాలయంలోకి మద్యం తీసుకొచ్చిన ఇద్దరు ఆర్టీఏ ఏజెంట్లు మధు, సాధిక్‌తోపాటు సురేశ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో మహబూబాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో మూడేండ్లుగా విధులు నిర్వహిస్తున్న వారందరినీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగిస్తూ రవాణాశాఖ కమిషనర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

