బడికొచ్చే పిల్లలకు రవాణా భత్యం

- ఆవాసాలకు దూరంగా బడికెళ్లేవారికి అందజేత
- తాజాగా 8, 9 తరగతుల విద్యార్థులకూ వర్తింపు
- రూ.24.35 కోట్లు విడుదలచేస్తూ జీవో జారీ
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ):పాఠశాలలు లేని పల్లెలు, ఆవాసాల్లో ఉంటూ చదువుకోసం సమీప గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యాన్ని మంజూరుచేస్తూ విద్యాశాఖ జీవో ఇచ్చింది. 2021-22 సంవత్సరానికి రూ.24.35 కోట్లు విడుదలచేస్తూ ఆశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సల్తానియా గురువారం జీవో జారీచేశారు. ఇప్పటివరకు 1-8 తరగతుల వారికి మాత్రమే రవాణాభత్యం అందజేస్తుండగా.. ఈ ఏడాది నుంచి 9, 10 తరగతులవారికి సైతం వర్తింపజేశారు. పలు గ్రామాల విద్యార్థులు సమీప గ్రామాల్లోని పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరిలో కొందరు ఆటోలు, మరికొందరు వ్యాన్లు, ఇతర వాహనాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీరికి రవాణాభత్యాన్ని అందజేయాల్సి ఉన్నది. 1-5వ తరగతి వరకు ఒక కిలోమీటర్, 8వ తరగతి వరకు 3 కిలోమీటర్లు, 9, 10 తరగతులకు 5 కిలోమీటర్ల దూరంలోని స్కూళ్లల్లో చదువుకుంటే రవాణాభత్యం ఇవ్వాలి. తాజా నిర్ణయంతో 1-10వ తరగతి వరకు గల మొత్తం 40,598 మంది విద్యార్థులకు సంవత్సరానికి ఒక్కొక్కరికి సుమారు రూ.6 వేల చొప్పున రవాణాభత్యం పిల్లల ఖాతాలో జమకానున్నది. కరోనాతో పాఠశాలలు నడవకపోయినా, తరగతులు నిర్వహించకపోయినా రవాణాభత్యాన్ని ఇవ్వనుండటం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

