హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో 317 జీవో అమలు ద్వారా స్థానికేతర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు పొందిన గిరిజన గురుకులంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి స్థానికత ఆధారంగా పోస్టింగ్‌లు కల్పిస్తూ బదిలీ చేశారు. ఈ మేరకు ఎస్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 286 మంది గిరిజన గురుకుల సిబ్బందికి వారి వెబ్ఆప్షన్ ఆధారంగా పోస్టింగ్‌లను ఇచ్చారు. మల్టీజోనల్, జోనల్, డిస్ట్రిక్ లెవల్లో గిరిజన గురుకుల సొసైటీలో మొత్తంగా 1,487మంది టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. 317 జీవో అమలుతో వారిలో దాదాపు 370 మంది ఉద్యోగులు స్థానికేతర ప్రాంతాల్లో పోస్టింగ్‌లను పొందారు. దానిని సవాల్ చేస్తూ 40 మంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. వారి నియామకంపై ప్రస్తుతం స్టేటస్కో కొనసాగుతున్నది. వారిని మినహాయించి మిగిలిన 330 మంది ఉద్యోగులకు స్థానికత ఆధారంగా పోస్టింగ్‌లను ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆయా ఉద్యోగుల నుంచి 15న వెబ్ఆప్షన్స్ను గిరిజన సొసైటీ స్వీకరించింది. వారిలో 286 మందికి స్థానికత ఆధారంగా పోస్టింగ్‌లను కల్పిస్తూ సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో స్కూల్ ప్రిన్సిపల్స్ 11మంది, డిగ్రీ లెక్చరర్స్ 17మంది, జూనియర్ లెక్చరర్స్ 21మంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ 02, టీజీటీ 188, జూనియర్ కాలేజీ లైబ్రేరియన్ 04, పీజీటీ 19, స్కూల్ పీడీ 03, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 10, సూపరింటెండెంట్ 1, స్టాఫ్ నర్సులు 06, ఇతర సహాయ సిబ్బంది 4 ఉన్నారు. బదిలీ పొందిన వారిని రిలీవ్ చేయడంతోపాటు, పోస్టింగ్ పొందిన వారిని రిపోర్ట్ చేసిన వెంటనే జాయిన్ చేసుకోవాలని అన్ని గిరిజన గురుకులాల ప్రిన్సిపాల్స్‌కు సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అవుతున్న ప్రిన్సిపాల్స్ సదరు గిరిజన గురుకులంలోని సీనియర్ డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీలకు బాధ్యతలను అప్పగించి స్వతహాగా రిలీవ్ కావాలని మార్గదర్శకాలను జారీ చేశారు.
స్థానికత ఆధారంగా పోస్టింగ్‌లను కల్పించిన ప్రభుత్వానికి, ఎస్టీ సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి, అధికారులకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) కృతజ్ఞతలు తెలిపింది. టిగారియా అధ్యక్షుడు మామిడి నారాయణ, జనరల్సెక్రటరీ మధుసూదన్ హర్షం వ్యక్తం చేశారు.