జర్మనీలో ఉద్యోగాలకు శిక్షణా తరగతులు ప్రారంభం
జర్మనీ దేశంలో వివిధ వృత్తులు చేపట్టేందుకు అవసరమైన శిక్షణను బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ప్రారంభించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) : జర్మనీ దేశంలో వివిధ వృత్తులు చేపట్టేందుకు అవసరమైన శిక్షణను బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ప్రారంభించింది. ఈ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాణికుముదిని, జర్మనీ కౌన్సిల్ జనరల్ మైఖేలా కుచ్లర్ హాజరయ్యారు. శిక్షణ కోసం 62 మంది అభ్యర్థులను ఎంపికచేశారు. వీరికి జర్మనీ భాష, అక్కడి సంస్కృతీ సాంప్రదాయాలతోపాటు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక రెండు-మూడేండ్లు అప్రెంటిస్‌షిప్ కల్పించి, తరువాత ఉద్యోగాలిస్తారు. రాణికుముదిని మాట్లాడుతూ, విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లేవారు సురక్షితంగా తమ వృత్తి బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రభుత్వం టామ్‌కామ్ ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Germany
- jobs
- Training classes
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

