హైదరాబాద్: హైదరాబాద్‌లోని (Hyderabad) ట్యాంక్‌బండ్‌లో (Tankbund) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్ (Hussain sagar) పరిసరాల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. పలుమార్గాలను మూసివేయడంతోపాటు దారిమళ్లించనున్నారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ రూట్లలోకి వచ్చే ట్రాఫిక్‌ను ఆయా కూడళ్లలో ఇతర మార్గాలకు మళ్లించడంతోపాటు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసి ఉంటాయని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.