హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన సిరికొండ మధుసూదనాచారి ఆదివారం పదవీ ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి తన చాంబర్లో పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.