Jishnudev Verma | నేడు రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోనున్న జిష్ణుదేవ్ వర్మ
Jishnudev Verma | తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జిష్ణుదేవ్ త్రిపురలోని తన నివాసమైన కుంజబన్ ప్యాలెస్ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకొని సాయంత్రం 5.03 గంటలకు గవర్నర్‌గా బాధ్యతలు చేపడతారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990 ప్రారంభంలో బీజేపీలో చేరారు. జిష్ణుదేవ్ 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. త్రిపుర నుంచి ఓ రాష్ర్టానికి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తిని తానేనని జిష్ణుదేవ్ వర్మ సోమవారం అగర్తలాలో మీడియాకు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

