హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి సభను శనివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రధాన వక్తగా ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా శివలింగ ప్రసాద్, అంపశయ్య నవీన్, శ్రీధర్ దేశ్‌పాండేకు స్ఫూర్తి పురస్కారా లు ప్రదానం చేయన్నారు.