ఉద్యోగుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక్క రోజులోనే పరిష్కరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యోగ బాంధవుడని తెలంగాణ నాన్

- సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.. 33 జిల్లాల్లో సభలు
- ఒక్క రోజులోనే సకల సమస్యలకు
- పరిష్కారం చూపారంటూ సంతోషం
- రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం
- రాష్ట్రవ్యాప్తంగా టీఎన్జీవోల బస్సు యాత్ర
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒక్క రోజులోనే పరిష్కరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్యోగ బాంధవుడని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కొనియాడింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతా సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం భద్రాద్రి నుంచి బాసర వరకు, గద్వాల నుంచి ఆదిలాబాద్ వరకు బస్సుయాత్రలు నిర్వహించాలని తీర్మానించింది. బుధవారం టీఎన్జీవో భవన్లో టీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రికి కార్యవర్గం ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపిందని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారి.. సభ సాక్షిగా టీఎన్జీవో ఘన చరిత్రను సీఎం కేసీఆర్ ప్రశంసించడం అపూర్వమని పేర్కొన్నారు. తెలంగాణ అనే పదాన్ని గత ఎనిమిది దశాబ్దాలుగా భుజాల మీద వేసుకొని, ఉద్యోగుల హక్కులతోపాటు తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో ముందుండి పోరాడిన సంఘం టీఎన్జీవో అని సీఎం చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సమావేశంలో టీఎన్జీవో ఉపాధ్యక్షులు, కస్తూరి వెంకటేశ్వర్లు, శ్యామ్‌సుందర్, స్వామి, నరసింహాచారి, ఉమాదేవి, సెక్రటరీలు ఎం సత్యనారాయణగౌడ్, నజీర్, ఎంబీ నరేందర్, ఏ రాజేందర్, తిరుమల్‌రెడ్డి, రాము, లక్ష్మణరావు, రవి, దివ్య, జీ చంద్రశేఖర్, కే రమేశ్, కార్యనిర్వాహక కార్యదర్శి ఈ కొండల్‌రెడ్డి, ప్రచార కార్యదర్శి జగదీశ్వర్, కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్రభుత్వం పరిష్కరించిన సమస్యలు
- 30% ఫిట్మెంట్
- పదవీవిరమణ వయస్సు 58 నుంచి 61 ఏండ్లకు పెంపు
- సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్
- 70 ఏండ్లు నిండిన ప్రభుత్వ పెన్షనర్లకు 15% అదనపు పెన్షన్
- 12 నెలల వేతన బకాయిల చెల్లింపు
- ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని బలోపేతం చేయడం
- గ్రాట్యుటీ 12 లక్షల నుండి 16 లక్షలు పెంపు
- పదివేల ప్రధానోపాధ్యాయ పోస్టుల మంజూరు
- ఉద్యోగులు, టీచర్లకు అంతర్జిల్లా బదిలీలు
- ఇప్పటికే ఇచ్చిన 24 వేల పదోన్నతులతోపాటు మిగిలిన పదోన్నతులను వెంటనే చేపట్టడం
- 50,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ
టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ తీర్మానాలు
- ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ 30% ఫిట్మెంట్ మంజూరు, పదవీ విరమణ వయసు పెంపు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ వర్తింపు తదితర సమస్యలన్నింటినీ పరిష్కరించినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం.
- రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం టీఎన్జీఓలుగా ఉంటూ.. గెజిటెడ్ అధికారులుగా పదోన్నతులు పొందిన మొదటిస్థాయి అధికారులను టీఎన్జీవో సంఘంలో కొనసాగించడం.
- టీఎన్జీవో బైలాకు సవరణ
- టీఎన్జీవో సంఘాన్ని గ్రామస్థాయి నుండి
- రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయడం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమం.
- ఉద్యోగులు సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వ్యత్యాసాల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి.
- ప్రభుత్వశాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ చర్యలను అభినందిస్తూ తీర్మానం.
- ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి పంపిస్తూ ఉత్తర్వుల్విడంపై కృతజ్ఞతలు.
- జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు స్కేలు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు
ఇవీ కూడా చదవండి
అదిరే ఫీచర్లతో షియోమీ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

