హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ): తిరుమల కొండలు ఎంతో పవిత్రమైనవని, ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని దేవుడి గదిలా భావించి పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
శనివారం తిరుమలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలిసి ‘సుందర తిరుమల-శుద్ధ తిరుమల’ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ప్లాస్టిక్ రహిత తిరుమలగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.