హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : మాజీ మావోయిస్టు ఆగ్రనేత తిప్పిరి తిరుపతి (దేవ్‌జీ) గన్ను వదిలేసి, పెన్ను పట్టబోతున్నారు. ఆగిపోయిన తన చదువును తిరిగి కొనసాగించనున్నారు. ఈ మేరకు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దేవ్‌జీ ఇటీవల ఇంటర్‌బోర్డును ఆశ్రయించారు. ఆయన.. కొంతకా లం క్రితం బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా ఓపెన్ డిగ్రీలో చేరేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. దేవ్‌జీ 1983 ప్రాంతంలో కోరుట్ల కాలేజీలో ఇంటర్ చదివారు. సెకండియర్ తెలుగులో ఫెయిలయ్యారు. ఇప్పుడు తెలుగు సబ్జెక్టు పరీక్ష రాసేందుకు అవకాశమివ్వాలని బోర్డును సంప్రదించారు.
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రైతు డిస్కం నియామక మార్గదర్శకాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ల హక్కులను పరిరక్షించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం (టీఎస్ఈఏఈఏ), తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం (టీఈఏఈఏ) లు సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు సంఘాల ప్రతినిధులు రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిసి వినతిపత్రం అందజేశారు.