హైదరాబాద్ : గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఖాళీగా ఉన్న 199 క్లినికల్, నాన్ క్లినికల్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఏప్రిల్ 16, 17, 19వ తేదీల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కేటగిరిల వారీగా వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహించనుంది.
ఖాళీల వివరాలిలా ఉన్నాయి. ప్రొఫెసర్లు-12, అసోసియేట్ ప్రొఫెసర్-23, అసిస్టెంట్ ప్రొఫెసర్-22, మెడికల్ ఆఫీసర్-94, నర్సింగ్ సూపరింటెండెంట్(గ్రేడ్-2)-1, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్/హెడ్ నర్సు-6, స్టాఫ్ నర్సులు-32, డైటీషియన్-1, ఫార్మసిస్ట్-8 పోస్టులు ఉన్నాయి.
నెలవారీ వేతనం ప్రొఫెసర్లకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్లకు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రూ.1.25 లక్షలు, మెడికల్ ఆఫీసర్లకు రూ.40,270, నర్సింగ్ సూపరింటెండెకు రూ.35,120, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌కు రూ.25,140, స్టాఫ్ నర్సుకు రూ.35,120, డైటీషియన్‌కు రూ.35,120. ఫార్మసిస్టులకు రూ. 21,230 గా ఉంది.