కాగజ్‌నగర్‌లో పులి కలకలం
Kagaznagar | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం సృష్టించింది. పట్టణంలోని వినయ్ గార్డెన్ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూశారు. దీంతో ప్రయాణికులు
కాగజ్‌నగర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం సృష్టించింది. పట్టణంలోని వినయ్ గార్డెన్ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పులి పాదముద్రలు సేకరించారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పులి జాడను వీలైనంత తొందరగా కనిపెట్టాలని అధికారులు ఆదేశించారు. కాగా, పులి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గతనెల 28న కూడా కాగజ్‌నగర్‌లో పెద్దపులి కనిపించింది. గతకొన్ని రోజులుగా కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో సంచరిస్తున్న పులి.. పశువులపై దాడిచేస్తున్నది. వారం రోజుల వ్యవధిలో ఎనిమిది పశువులను చంపి తినేసింది. డివిజన్లో వేంపల్లి, కోసిని, అనుకోడ, అంకుశపూర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

