Free Bus for Women | పల్లె వెలుగు బస్సులో మహిళా ప్యాసింజర్లకు టికెట్లు ఇచ్చిన కండక్టర్..
పల్లె వెలుగు బస్సులో ఓ కండక్టర్ ఇద్దరు మహిళా ప్యాసింజర్లకు డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది.
- కండక్టర్‌తో సదరు ప్రయాణికుల వాగ్వాదం
- వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు.. వైరల్
- విచారణకు ఆర్టీసీ ఎండీ ఆదేశం
Free Bus for Women | శక్కర్‌నగర్, డిసెంబర్ 10: పల్లె వెలుగు బస్సులో ఓ కండక్టర్ ఇద్దరు మహిళా ప్యాసింజర్లకు డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై ఆదివారం సాయంత్రం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ నుంచి బోధన్‌కు వస్తున్న పల్లె వెలుగు బస్సులో పలువురు ప్రయాణికులు ఎక్కారు. అందులో ఓ ప్రయాణికుడు ముగ్గురికి టికెట్లు కావాలని డబ్బులు ఇచ్చాడు. కండక్టర్ నర్సింలు ముగ్గురికి టికెట్ పంచ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి మహిళలకు ఫ్రీ కదా.. మూడు టికెట్లు ఎలా ఇస్తావని కండక్టర్‌ను నిలదీశాడు. ‘మహిళా ప్యాసింజర్లు ఉన్నట్టు నాకు ఎలా తెలుస్తది.. మీరే ఆ విషయాన్ని చెప్పి టికెట్లు తీసుకోవాలి’ అని కండక్టర్ చెప్పారు.
డబ్బులు వాపసు ఇస్తానని కండక్టర్ చెప్పినా.. తమకు డబ్బులు వాపసు ఎలా చేస్తావు? మహిళలకు టికెట్లు తీసుకోవద్దని తెలియదా? అని సదరు ప్రయాణికుడు వాదించడంతో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగింది. ఈ ఘటనను వీడియో తీసిన వారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా వైరల్ అయ్యింది. ఈ విషయం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలకు జారీ చేశారు. బోధన్ ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఆర్టీసీ ఎండీ తమను ఆదేశించిన విషయం వాస్తవమేనని, సదరు ప్యాసింజర్‌ను పిలిపించి విచారణ జరుపుతున్నామని తెలిపారు. అనంతరం విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

