అలంపూర్‌లో బొలెరోను ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకులు మృతి
జోగులాంబ గద్వాల జిల్లా బైరాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరాపూర్ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా బైరాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరాపూర్ సమీపంలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను మానవపాడు మండలం కొరివిపాడు గ్రామానికి చెందిన సాయి, రఫీ, శేఖర్గౌడ్గా గుర్తించారు. అలంపూరులో మహాశివరాత్రి వేడుకల్లా పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ దావాఖానకు తరలించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ రోడ్డులో జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు టైరు పంక్చరవడంతో అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలివైపునకు ఎగిరిపడింది. అదేసమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఆ కారును ఢీకొట్టింది. దీంతో నలుగురు మహిళలు సహా మరొకరు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు అద్దంకి ఎస్ఐ సమందరవలి భార్య వహీదా, కుమార్తె అయేషా, జయశ్రీ, దివ్యతేజ, డ్రైవర్ బ్రహ్మచారిగా గుర్తించారు. చిన్న గంజాం జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | మారిన మద్దతు లెక్కలు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ఎన్డీయే ‘మిషన్ 360’
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

