Nizamabad | జ్యువెలరీ షాప్‌కు కన్నం వేసేందుకు విఫలయత్నం.. పోలీసులు రావడంతో పరారైన దుండగులు
నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా దోపిడీ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
వినాయక నగర్, జనవరి 02 : నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా దోపిడీ దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. గత వారం రోజులుగా జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు విరుచుకుపడుతున్నారు. డిసెంబర్ 27వ తేదీన రెండు ఏటీఎం సెంటర్ లను దోచుకుపోయిన ఘటనలో పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం మళ్లీ స్థానిక ఖలీల్ వాడి ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం డ్యూటీ కి ఎదిరించిన మరో ఘటన వెలుగు చూసింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మళ్లీ తాజాగా దోపిడీ యత్నం మరొ ఘటన గురువారం అర్ధరాత్రి అనంతరం వెలుగు చూసింది. నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు బజార్ సమీపంలో గల శ్రీగణేష్ జ్యువెలరీ షాప్ ను(Jewelry shop) దోచుకునేందుకు దుండగులు విఫల యత్నం చేశారు. అర్ధరాత్రి అనంతరం ముఖాలకు ముసుగులు ధరించి ఉన్న ముగ్గురు సభ్యులు జ్యువెలరీ షాపు వద్దకు వచ్చి ఇనుప రాడ్లతో షట్టర్ ను ధ్వంసం చేసి పైకి లేపే లోనికి దూరెందుకు ప్రయత్నించారు.
అదే సమయంలో నైట్ పెట్రోలింగ్ సిబ్బంది అటువైపుగా రావడాన్ని గమనించిన దుండగులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే పోలీసు సిబ్బంది సైతం వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన దుండగులు తప్పించుకున్నట్లు తెలిసింది. విషయం తెలియడంతో ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి, నగర సీఐ శ్రీనివాస్ రాజ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై షాపు యజమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో టౌన్ ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

