హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘పెండింగ్ పైళ్లు ఉండొద్దు.. ఏ రోజు ఫైళ్లు ఆరోజే సమర్పించాలి. మ్యాన్యువల్‌గా కాకు ండా ఈ-ఆఫీసు విధానంలోనే ఫైళ్లు సమర్పించాలి. సకాలంలో ఆఫీసుకు రండి. సెలవు పెడితే ముందస్తు అనుమతి తప్పనిసరి. అంతా విద్యార్థుల కోసం పనిచేస్తున్నామని గుర్తుంచుకోండి. ఇతర అలవాట్లు ఏవైనా ఉంటే మానుకోండి..’ ఇది బోర్డు కార్యదర్శి, కొత్త డైరెక్టర్ క్రిష్ణ ఆదిత్య అధికారులకు ఇచ్చిన ఆదేశాలు. ఇంటర్‌బోర్డు కార్యదర్శి, ఇంటర్ విద్య డైరెక్టర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి క్రిష్ణచైతన్య బుధవారం నాంపల్లిలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమైన ఆయన క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఆదేశించారు. అంతా నిబంధనల ప్రకారమే పనిచేయాలని స్పష్టంచేశారు. ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్, గెజిటెడ్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు కనకచంద్రం, ప్రిన్సిపాల్స్ సంఘం నేతలు, బోర్డు అధికారులు, సిబ్బంది, తదితరులు బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన క్రిష్ణ ఆదిత్యకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ముగిసిన ‘మైటా’ దశాబ్ది ఉత్సవాలు
హైదరాబాద్, నవంబర్ 13(నమ స్తే తెలంగాణ) : ఈ నెల 9న ప్రారంభమైన మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైటా) దశాబ్ది ఉత్సవాలు బుధవారం ముగిశాయి. అసోసియేషన్ ఏర్పడి పదేండ్లు పూర్తయిన సం దర్భంగా ఈ వేడుకలు నిర్వహించా రు. ఈ సందర్భంగా మలేషియాలో వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతిగాంచి న వారిని అవార్డులతో సత్కరించా రు. ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహి ళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్ పాల్గొన్నారు.