దవాఖానల్లో మందుల కొరత లేదు
ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. నమస్తే తెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన ‘మందుల్లేవు - నిధుల కోత, ఔషధాల కొరత’ వార్తపై స్పందించింది.
- సరఫరాదారులకు రూ.124 కోట్లు చెల్లించాం
- నమస్తే’ కథనంపై వైద్యారోగ్యశాఖ వివరణ
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో ఎక్కడా మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. నమస్తే తెలంగాణలో శుక్రవారం ప్రచురితమైన ‘మందుల్లేవు – నిధుల కోత, ఔషధాల కొరత’ వార్తపై స్పందించింది. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు సరఫరాదారులకు రూ.124 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని, మరో రూ.316 కోట్ల మేర చెల్లింపుల కోసం ఆర్థిక శాఖకు చెక్కులు పంపించామని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని దవాఖానలు, సీఎంఎస్ స్టోర్లలో సరిపడా మందుల నిల్వలు ఉన్నాయని, దవాఖానల నుంచి విజ్ఞప్తి రాగానే సీఎంఎస్ స్టోర్ల నుంచి మందులు సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నది. ‘ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్’ నుంచి టీఎస్ఎంఎస్ఐడీసీ ఎలాంటి ఔషధాలు కొనుగోలు చేయడం లేదని తెలిపింది. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మందుల సరఫరా నిలిచిపోవడమనేది అసత్యమని వివరించింది. హీమోఫీలియా ఫ్యాక్టర్ 7, 8, 9 ను ప్రముఖ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తామని, ప్రస్తుతం దవాఖానల్లో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

