హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): దోమకాటు వల్ల ఏర్పడే మస్కిటో ఎలర్జీ రోజురోజుకు ఆందోళనకరంగా తయారవుతున్నది. స్కీటర్ సిండ్రోమ్గా పిలిచే ఈ ఎలర్జీ.. మనిషిని దోమ కుట్టినప్పుడు దాని లాలాజలంలో ఉండే పాలిపప్టైడ్ పదార్థం వల్ల వస్తుంది. హైదరాబాద్కు చెందిన ఓ అలర్జీ సెంటర్ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ కేసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలింది. సదరు అలర్జీ సెంటర్.. 500 మంది వివిధ వయస్కులపై ఐదేండ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో చాలా మంది పిల్లలు, పెద్దలు దురద, దద్దుర్లతో బాధపడుతున్నట్టు తేల్చింది. దీని తీవ్రత హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నదని నిర్ధారించింది. అపరిశుభ్ర గృహనివాస కాలనీలు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఈ అలర్జీలు ఎక్కువగా బయటపడ్డాయని స్పష్టం చేసింది. గ్లోబల్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా ఈ అలర్జీని నిర్ధారించవచ్చని హైదరాబాద్లో నేషనల్ అలర్జీ హెల్ప్ లైన్ నడుపుతున్న సీనియర్ అలర్జీ స్పెషలిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు.
స్కీటర్ సిండ్రోమ్ లక్షణాలు: