Dengue vaccine | లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూకుడు.. డెంగీ వ్యాక్సిన్ తయారీకి రంగం సిద్ధం
లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూకుడు తగ్గడం లేదు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా డెంగీ జ్వరానికి విరుగుడు హైదరాబాద్ వేదికగా తయారు కానున్నది.
- పరిశోధనల్లో నిమగ్నమైన ఐఐఎల్
- 2026 నాటికి అందుబాటులోకి తీసుకు వచ్చేలా పక్కా గా ప్రణాళిక
Dengue vaccine | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ దూకుడు తగ్గడం లేదు. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనతను సొంతం చేసుకోగా, తాజాగా డెంగీ జ్వరానికి విరుగుడు హైదరాబాద్ వేదికగా తయారు కానున్నది. ఏడాది కాలంగా ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో డెంగీ వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు జరుగుతుండగా, దేశంలోని పలు వ్యాక్సిన్ తయారీ సంస్థలతోపాటు హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే సంస్థ ముందుకు వచ్చింది. వ్యాక్సిన్ తయారీ అధ్యయనాలు చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్, పాన్ ఏషియా బయోటెక్‌తోపాటు ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్ (ఐఐఎల్) అర్హత సాధించింది. 2021-22 వరకు ఏటా కేసులు 21శాతం పెరుగుతున్నట్టు జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తయారీ అత్యంత కీలకంగా మారింది.
2026 నాటికి వ్యాక్సిన్ సిద్ధం
అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ సహకారంతో ఐఐఎల్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నది. ఇప్పటికే ఓ దఫా ట్రయల్స్ నిర్వహించామని ఐఐఎల్ ఎండీ కే ఆనంద్‌కుమార్ వెల్లడించారు. 18-50 ఏండ్ల మధ్య వయసు వారితో తొలి దఫా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చినట్టు తెలిపారు. తొలి దఫా ట్రయల్స్ పూర్తి కావాల్సి ఉందని, వచ్చే రెండేండ్లలో మరోసారి ట్రయల్స్ నిర్వహించి, ఫలితాల ఆధారంగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తయారీపై దృష్టి పెడతామని వివరించారు. 2026 నాటికి బహిరంగ మార్కెట్లోకి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మ్యూటేషన్లను తట్టుకునేలా వ్యాక్సిన్ రూపకల్పనపై దృష్టి సారించినట్టు తెలిపారు. డెంగీ వ్యాక్సిన్ తయారీతో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ మరో ఘనత సాధిస్తుందని ఐఐఎల్ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

