స్టాఫ్‌నర్స్ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల
రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల భర్తీకి సోమవారం ప్రొవిజనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన పాయింట్లు, మార్కులను ఇందులో పొందుపరిచింది.
- 7,094 ఉద్యోగాల భర్తీకి ముందడుగు
- ప్రాథమిక ‘కీ’నే ఫైనల్
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల భర్తీకి సోమవారం ప్రొవిజనల్ లిస్ట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన పాయింట్లు, మార్కులను ఇందులో పొందుపరిచింది. అభ్యంతరాలుంటే ఈ నెల 20 వరకు వారి లాగిన్ నుంచి దరఖాస్తు చేయొచ్చని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. స్టాఫ్‌నర్స్ రాత పరీక్షకు సంబంధించి గతంలో ఇచ్చిన ప్రాథమిక కీలో ఎలాంటి తప్పులు లేవని పేర్కొన్నది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను నిపుణుల కమిటీ విశ్లేషించిందని, ఎలాంటి తప్పులు లేవని నిర్ధారించిందని వెల్లడించింది. కాబట్టి గతంలో విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’ నే తుది కీ గా అభ్యర్థులు భావించాలని సూచించింది.
7,094 పోస్టులకు పెంపు
రాష్ట్రవ్యాప్తంగా 9 విభాగాల్లో 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి 40వేల మందికిపైగా దరఖాస్తు వచ్చాయి. జూలైలో ఆన్లైన్లో పరీక్ష జరిగింది. తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియకు తాత్కాలిక ఆటంకం కలిగింది. తాజాగా.. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేకు మరో 1,890 పోస్టులను ప్రభుత్వం జత చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగింది. మొత్తం 9 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

