Rice Price | భారీగా పెరిగిన బియ్యం ధరలు.. క్వింటాలు రూ.6,200
నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.
- రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ.1500 పెరుగుదల
- మార్కెట్లో తగ్గిన బియ్యం లభ్యత
- ఈ యాసంగిలోనూ వరిసాగు తగ్గే అవకాశం
Rice Price | హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. నిన్నమొన్నటి వరకు కిలో బియ్యం రూ. 45 నుంచి రూ.50 మధ్య లభించగా ఇప్పుడా ధర ఏకంగా రూ. 60కి పెరిగింది. కొంచెం మంచి రకాలైతే రూ. 70 వరకు చెల్లించుకోవాల్సి వస్తున్నది. ప్రజలు ఎక్కువగా వినియోగించే సన్న రకాలైన బీపీటీ, హెచ్ఎంటీ, సోనామసూరి ధరలు సగటున క్వింటాలుకు రూ.1000 నుంచి రూ. 1500 వరకు పెరిగాయి. నిరుడు క్వింటాలు రూ. 4,500 నుంచి రూ. 5 వేల మధ్య లభించగా ఇప్పుడు ఏకంగా రూ. 6,200 వరకు పెరిగింది. ఇందులో పాతబియ్యం అయితే రూ.7,500 వరకు పలుకుతున్నది. హెచ్ఎంటీ, బీపీటీ కొత్త రకం బియ్యం ధర గతంలో క్వింటాలుకు రూ. 3,300 నుంచి రూ. 3,500 వరకు ఉండగా ఇప్పుడది రూ. 4,500కు చేరింది. మొత్తంగా బియ్యం ధరలు సగటున రూ. 1000 పెరిగాయి.
తగ్గిన సన్నాల సాగు
బియ్యం ధరల పెరుగుదలకు ఆయా రాష్ర్టాల్లో వరిసాగు తగ్గడం కూడా ఒక కారణమని చెప్తున్నారు. నిజానికి ఈ వానకాలంలో దేశవ్యాప్తంగా వరిసాగు పెరిగినప్పటికీ కొన్ని రాష్ర్టాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులకు తోడు, మరికొన్ని రాష్ర్టాల్లో వరదల కారణంగా భారీగా పంటనష్టం సంభవించింది. ఇది అంతిమంగా బియ్యం ధరపై ప్రభావం చూపిస్తున్నది. దీనికితోడు సన్నాల సాగు కూడా గణనీయంగా పడిపోయింది. ప్రతి ఏటా వానకాలంలో మొత్తం సాగులో 50 శాతం సన్నాలు ఉండగా, ఈసారి మాత్రం 30 శాతానికే పరిమితమైంది. తెలంగాణలో ఈ వానకాలంలో రికార్డుస్థాయిలో 65 లక్షల ఎకరాల్లో వరిసాగైంది. ఈ లెక్కన దాదాపు 1.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావాల్సి ఉండగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలులో ఇది 45 లక్షల టన్నులకే పరిమితమైంది. గతంలో ఎంతోకొంత సన్నాలు వచ్చేవి. ఈ సీజన్లో మాత్రం కేజీ బియ్యం కూడా కొనుగోలు కేంద్రాలకు రాలేదు. బియ్యం ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుల బడ్జెట్‌కు చిల్లు పడుతున్నది.
మరింత పెరిగే అవకాశం
బియ్యానికి ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో సాధారణ రకం బియ్యం 25 కిలోల బస్తా ధర రూ. 180 నుంచి రూ. 250 చొప్పున పెరిగింది. ఈ లెక్కన గతంలో రూ.1200 ఉన్న 25 కిలోల బస్తా ధర ప్రస్తుతం రూ. 1,350 వరకు ఉంది. ఫైన్ క్వాలిటీ బియ్యమైతే రూ. 1,650-1,800 మధ్య పలుకుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు ధరలు మరింత పెరగక తప్పని పరిస్థితి నెలకొంటుందని వ్యాపారులు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

