BJP | ఈటల, రఘునందన్‌రావుకు కిషన్ రెడ్డి షాక్.. పార్టీ మారినోళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండదని వ్యాఖ్య
BJP | వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని మీడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు.
BJP | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 ( నమస్తే తెలంగాణ ): వేరే పార్టీనుంచి బీజేపీలో చేరినవారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. వేరే పార్టీలోనుంచి వచ్చినవాళ్లకు బీజేపీలో ప్రాధాన్యం ఉండబోదని మీడియా సాక్షిగా చెప్పకనే చెప్పారు. దీంతో పక్కనే ఉన్న దుబ్యాక ఎమ్మెల్యే రఘనందన్‌రావు తెల్లముఖం వేశారు. అనుమతి లేకుండానే బాటసింగారం డబుల్ బెడ్ రూం ఇండ్ల పరిశీలనకు బయలుదేరిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రఘునందన్‌రావు, చింతల రాంచంద్రారెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తూ తన మనసులో మాట బయటపెట్టారు.
‘మా రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. మేం పార్టీలు మారిన వ్యక్తులం కాదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో పక్కనే ఉన్న రఘునందన్‌రావు ముఖంలో ఒక్కసారిగా హావభావాలు మారిపోయాయి. కిషన్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ దుమారం రేపుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణ తదితర నాయకులపై కూడా ‘పార్టీలు మారినోళ్లేననే’ వివక్ష ఉందనడానికి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తామంతా ఒక్కటేనని చెప్పుకుంటున్నా.. కిషన్‌రెడ్డి వ్యవహారంతో మరోసారి బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయని ప్రజలు చర్చించుకొంటున్నారు. ఇదిలా ఉండగా, రెండేండ్ల క్రితం ముషీరాబాద్‌లోని లంబాడితండలో కిషన్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌తో కలిసి డబుల్ బెడ్ రూంలను లబ్ధిదారులకు అందించారు. ఇది ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నదని, డబుల్ బెడ్ రూంలను పూర్తిచేసి పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఆయనే రెండేండ్ల తర్వాత ఇప్పుడు డబుల్ బెడ్రూం ఇండ్లపేరుతో రాజకీయం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

