హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) స్క్రీనింగ్‌కు యానిమేటెడ్ మూవీ ‘ది లైట్’ ఎంపికైంది. బ్రహ్మకుమారీ గుడ్‌వుడ్ స్టూడియో ద్వారా నిర్మించిన ఈ చిత్రం మానవుడి మానసిక దృక్పథాన్ని సకారాత్మక దిశగా తీసుకెళ్లేందుకు దోహదపడే అద్భుతచిత్రం. స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన సాధ్యమని నిరూపించే ఆధ్మాత్మిక జీవన విధానాన్ని తెలిపే అంశాలను ఇందులో చూపించారు. చిత్ర నిర్మాత హరిలాల్ భానుశాలి, బ్రహ్మకుమారీస్ అడిషనల్ చీఫ్ రాగయోగిని జయంతిదీది, సుర్జిత్ సర్కార్ ఈ చిత్రప్రదర్శనలో పాల్గొన్నారు.