Telangana | ప్రాణాలను ఫణంగా పెట్టి.. కరెంట్‌ను పునరుద్ధరించిన జూనియర్ లైన్మెన్
Telangana | ఓ జూనియర్ లైన్మెన్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. గ్రామానికి కరెంట్‌ను పునరుద్ధరించాడు. చెరువులో మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం వరకు ఈదుకుంటూ వెళ్లి.. డిస్క్ మార్చి గ్రామానికి విద్యుత్‌ను అందించారు. జూనియర్ లైన్మెన్పై విద్యుత్ అధికారులు, గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Telangana | కరీంనగర్ : ఓ జూనియర్ లైన్మెన్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి.. గ్రామానికి కరెంట్‌ను పునరుద్ధరించాడు. చెరువులో మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం వరకు ఈదుకుంటూ వెళ్లి.. డిస్క్ మార్చి గ్రామానికి విద్యుత్‌ను అందించారు. జూనియర్ లైన్మెన్పై విద్యుత్ అధికారులు, గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. హుజురాబాద్ డివిజన్లోని రాజపల్లి 33/11కేవీ సబ్ స్టేషన్ నుంచి చెల్పూరుకు 11 కేవీ ఎక్స్ ప్రెస్ ఫీడర్ లైన్ స్థానికంగా ఉన్న చెరువులో నుంచి వెళుతుంది. ఆదివారం ఉదయం చెరువులో ఉన్న ఒక స్తంభంపై 11కేవీ లైన్ బ్రేక్ డౌన్ అయి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెల్పూరు జేఎల్ఎం వెంకటేశ్వర్లు, ఏఎల్ఎం పరుశురాం, లైన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య చెరువులోకి ఈత కొట్టుకుంటూ వెళ్లి లైన్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం వద్దకు ఈత కొడుతూ వెళ్లి సరఫరాను పునరుద్ధరించిన సిబ్బందిని ఎస్ఈ గంగాధర్, అధికారులు అభినందించారు. బ్రేక్ డౌన్‌ను సరి చేసేందుకు విద్యుత్ సిబ్బంది చెరువులోకి వెళ్లి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి తిరిగి బయటకు వచ్చే వరకు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

