‘కొత్త’ విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
దుర్గంచెరువులో ఐదు ఎకరాల ఆక్రమణలకు పాల్పడ్డారంటూ పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ప్రకటించారు. పిటిషనర్‌పై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది అభ్యంతరం తెలపడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్‌ను మరో న్యాయమూర్తికి కేటాయించేలా ఫైలును చీఫ్ జస్టిస్ ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
- పిటిషనర్‌పై జడ్జి వ్యాఖ్యలకు న్యాయవాది అభ్యంతరం
- కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి వెల్లడి
హైదరాబాద్, జనవరి 8, (నమస్తే తెలంగాణ): దుర్గంచెరువులో ఐదు ఎకరాల ఆక్రమణలకు పాల్పడ్డారంటూ పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ప్రకటించారు. పిటిషనర్‌పై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది అభ్యంతరం తెలపడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పిటిషన్‌ను మరో న్యాయమూర్తికి కేటాయించేలా ఫైలును చీఫ్ జస్టిస్ ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువును ఆక్రమించుకున్నారంటూ హైడ్రా అధికారి ఆనంద్ చేసిన ఫిర్యాదు మేరకు నిరుడు డిసెంబర్ 31న మాదాపూర్ పోలీసులు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. దీనిని కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా, గురువారం జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ జరిపారు. హైడ్రా తరపున వాదించేందుకు ఎవరూ హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు ఆక్రమణలకు పాల్పడుతున్నారనే కేసులో వాదనలు వినిపించేందుకు ఒకరు కూడా లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసులో వాదనలు వినేందుకు నిరాకరించారు. దీంతో పిటిషనర్ న్యాయవాది రామవరం చంద్రశేఖర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైడ్రా తరఫున న్యాయవాది లేరని వాదనలు వినకపోతే ఎలాగని, ఇది క్రిమినల్ కేసు కాబట్టి విచారణ చేపట్టాలని కోరారు. పోలీసులు నమోదుచేసిన కేసులు పిటిషనర్ అయిన ఎమ్మెల్యేకు వర్తించవని వాదించారు. పోలీసులు పిటిషనర్‌పై చేసిన ఆరోపణలను పరిశీలిస్తే.. 2014లో మట్టి పోశారని ఉందన్నారు. 2018లో పిటిషనర్ భార్య సదరు భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. దీనికి సంబంధించిన సేల్ డీడ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ దశలో న్యాయమూర్తి కల్పించుకుని డాక్యుమెంట్స్ రూపొందించడం ఎమ్మెల్యే స్థాయిలోని వాళ్లకు సులభమేనని వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేసుకు ఎమ్మెల్యేకు సంబంధంలేదని మరోసారి నొకి చెప్పారు. భూమిని ఎమ్మెల్యే భార్య కొన్నారని అన్నారు. ఎమ్మెల్యేపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ప్రకటించారు. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గణేశ్ వాదనలు వినిపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadiyam Srihari | జనగామ జిల్లాలో కడియం శ్రీహరికి నిరసన సెగ : వీడియో
Dimple Hayathi | డింపుల్ హయాతికి ఇంకా పెళ్లి కాలేదా.. శర్వానంద్‌తో చనువుపై వైరల్ కామెంట్స్‌కు హీరోయిన్ క్లారిటీ!
Sruthi Hassan | ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ కామెంట్స్.. జాన్వీ కపూర్ విషయంలో మాత్రం సైలెంట్!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

