రాష్ట్రంలో 19 జిల్లాల్లో లోటు వర్షపాతం
నైరుతి రుతుపవనాలు గురువారం దేశమంతటా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవంగా ప్రతి ఏటా జూలై 8 నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా విస్తరించాయని అధికారులు తెలిపారు.
- ఒక రోజు ఆలస్యంగా దేశమంతటా విస్తరించిన నైరుతి
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు గురువారం దేశమంతటా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవంగా ప్రతి ఏటా జూలై 8 నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా విస్తరించాయని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు గత నెల 8న రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు పెద్ద వర్షం కురువలేదు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 265 మండలాల్లో లోటు, 46 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగు పనులు మొదలు పెట్టిన రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. జూలైలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శుక్రవారం నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నది. ముఖ్యంగా జూలై 12 నుంచి 15 మధ్య తూర్పు తెలంగాణలో 37 నుంచి 40 డిగ్రీల వరకు, హైదరాబాద్లో 35 నుంచి 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

