గుడిసెను కూల్చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త
జేసీబీతో గుడిసెను కూల్చివేయడంతోపాటు అడ్డొచ్చిన భార్యాభర్తలను చితకబాధిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం చోటుచేసుకున్నది.
- అడ్డొచ్చిన దంపతులపై అమానుషంగా దాడి
- బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు
అచ్చంపేట రూరల్, జూలై 5: జేసీబీతో గుడిసెను కూల్చివేయడంతోపాటు అడ్డొచ్చిన భార్యాభర్తలను చితకబాధిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం చోటుచేసుకున్నది. పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని ఇంద్రనగర్ కాలనీలో తమకున్న స్థలంలో గుడిసె వేసుకొని దంపతులు తూర్పటి సాంబమ్మ, మంతయ్య జీవిస్తున్నారు. ఈ స్థలానికి కొన్నేండ్ల నుంచి ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నారు. ఆ స్థలం తమదంటూ కాంగ్రెస్ నాయకుడు, 8వ వార్డు కౌన్సిలర్ రేవల్లి చిట్టెమ్మ భర్త రాఘవులు దంపతులపై దౌర్జన్యం చేయడంతోపాటు జేసీబీతో గుడిసెను నేలమట్టం చేశాడని బాధితులు వాపోయారు.
ఇంటిని కూల్చి తమను రోడ్డుపాలు చేశారని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్‌ను వివరణ కోరగా.. ఆ ప్లాట్ రాఘవులు పేరిట ఉందని, అందుకే ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చామని చెప్పారు. ఎస్సై రాములును వివరణ కోరితే బాధితుల నుంచి తనకు ఫిర్యాదు అందిందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

