టిమ్స్ 21 అంతస్థులట!l
పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నగరం నలువైపులా బీఆర్ఎస్ హయాంలో మొదలైన టిమ్స్ దవాఖానలపై కాంగ్రెస్ మంత్రుల అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
- 14 అంతస్థులకు తగ్గించారట!
- కనీస అవగాహన లేని మంత్రులు
- మొన్న కోమటిరెడ్డి, నేడు దామోదర..
- నిర్ణయించిందే జీ+14గా నిర్మాణం
- ఎయిర్పోర్ట్ కారణంగా అల్వాల్‌లో జీ+5
- మంత్రుల వ్యాఖ్యలపై ప్రజల్లో విస్మయం
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నగరం నలువైపులా బీఆర్ఎస్ హయాంలో మొదలైన టిమ్స్ దవాఖానలపై కాంగ్రెస్ మంత్రుల అవగాహన రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. వాస్తవానికి టిమ్స్ భవనాలను జీ+14గా నిర్మించాలని ఆనాడే నిర్ణయించి పనులు చేపట్టారు. కానీ 21 అంతస్థుల్లో నిర్మిస్తుంటే తామే 14 అంతస్థులకు తగ్గించామని ఇటీవల ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించగా, తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ దవాఖానల ఎత్తును 21 అంతస్తుల నుంచి 14 అంతస్తులకు తగ్గించామని చెప్పి అభాసుపాలయ్యారు.
వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టిమ్స్‌ను ఏర్పాటు చేస్తుండగా ఆర్అండ్బీ శాఖ నిర్మాణ బాధ్యతలు చూస్తున్నది. ఇద్దరు మంత్రులు కనీసం వివరాలు తెలుసుకోకుండా మాట్లాడటంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అల్వాల్, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఎల్బీనగర్, సనత్‌నగర్ భవనాలను జీ+14గా, అల్వాల్‌లో జీ+5గా నిర్మించాలని నిర్ణయించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న నేపథ్యంలో అల్వాల్‌లో ఎత్తు తగ్గించినట్టు అప్పట్లో వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు పనులు కూడా జరుగుతున్నాయి.
రెండేండ్ల తర్వాతే వైద్యశాఖలో మార్పులు
వైద్యశాఖలో ప్రక్షాళన ప్రారంభమైందని, ఒకటి, రెండేండ్లలో స్థిరమైన మార్పు కనిపిస్తుందని మంత్రి దామోదర చిట్‌చాట్‌లో చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో మూడు రకాల టాస్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రైవేట్ దవాఖానలపై పర్యవేక్షణ, ఔషధాలు, ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండేలా కొత్తగా 75 కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతుల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

