పేదలకు ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన 19 ప్రభుత్వ దవాఖానలో ఈ 7 వ తేదీన 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ : రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో ఎంపిక చేసిన 19 ప్రభుత్వ దవాఖానలో ఈ 7 వ తేదీన 19 డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని అయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాలలో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ఆయన తెలిపారు. సాధారణ పరీక్షలు కాకుండా అత్యంత అరుదుగా చేసే ఖరీదైన ప్రత్యేక పరీక్షలు కూడా ఉచితంగా చేసి వెంటనే రిపోర్టులు ఇస్తారని అయన తెలిపారు. నిర్దారించిన రిపోర్టులు ఆయా రోగుల మొబైల్ ఫోన్లకు ఎస్ఎం ఎస్ రూపంలో పంపించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభత్వం చేసిందని ఆయన తెలిపారు. డయాగ్నోస్టిక్ కేంద్రాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మంత్రి కోరారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఐసోలేషన్ సెంటర్ను సందర్శించిన ఎంపీ కవిత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

