హైదరాబాద్, జులై 1 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ‘సోనాల’ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
బోథ్ మండలం నుంచి దీన్ని ఏర్పాటు చేశారు. కొత్త మండలంలో వజ్జర్, చింతల్బోరి, ఘన్పూర్, సోనాల, కోట(కే), సాకెరా, టివిటి, పార్డీ(బీ) పార్డీ(కే), గొల్లాపూర్ గ్రామాలు ఉండనున్నాయి.