నేల తల్లి బాగుంటేనే భవిష్యత్తు : మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | నేలతల్లి బాగుంటేనే.. మనం బాగుంటాం. భావి తరాలు బాగుంటాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : నేలతల్లి బాగుంటేనే.. మనం బాగుంటాం. భావి తరాలు బాగుంటాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పుడమి తల్లి మన అవసరాలను తీర్చగలదు గానీ అత్యాశలను ఎంతమాత్రం తీర్చలేదని ఆనాడు గాంధీజీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అన్నారు. కాలుష్యం వల్ల ఓజోన్ పొర క్షీణిస్తొందన్నారు.
భూమాతకు ఎటువంటి హానీ కలుగకుండా కాపాడుకోవాలని ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ఓ ప్రకటనలో కోరారు. భూమిని కాపాడుకోవటానికి పర్యావరణం, వాతావరణంతోపాటు మానవుని జీవనశైలిలో మార్పు రావాలని సూచించారు.
భూమిపై లభించే సహజ వనరులను మనం ఇష్టానుసారంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హానీ జరుగుతోందని వెల్లడించారు.
పూడమి తల్లిని కాపాడుకునేందుకు మనవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
మనిషి బతికేందుకు కావాల్సిన ఆక్సిజన్‌ను పొందడానికి చెట్లు చాలా అవసరమని వాటి ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
అడవుల రక్షణ, వన్యప్రాణులు, జీవ వైవిధ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇవి కూడా చదవండి..
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

