జెండా పండుగను జయప్రదం చేయాలి : మంత్రి గంగుల
మంత్రి గంగుల | టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించే పార్టీ జెండా పండుగను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించే పార్టీ జెండా పండుగను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కరీంనగర్ నియోజకవర్గంలోని నగర మేయర్, డిప్యూటీ మేయర్, కొత్తపల్లి చైర్మన్ కరీంనగర్, కొత్తపల్లి మండలాలకు చెందిన టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, కో ఆప్షన్, జడ్పిటీసీలతో సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారధ్యంలో ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన చరిత్ర కేవలం టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. 2023 లో 100 సీట్లతో అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు కష్టపడాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 70శాతం ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ప్రభుత్వానికి పార్టీకి వారధిగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులతో సమన్వయం చేసుకొని వార్డు, డివిజన్, గ్రామ కమిటీలను వేసుకోవాలని తెలిపారు.
నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాలలో సెప్టెంబర్ 2న, జెండా పండుగను ఒక పండుగ వాతావరణం లో జరపడానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కేసీఆర్ నేతృత్వలో ఒక ఉప్పెనలా మొదలైన టీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఈనాడు ఢిల్లీలో సైతం కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదగడం ఎంతో గర్వకారణం అన్నారు.గల్లీ నుంచి ఢిల్లీ వరకు గులాబీ జెండాను ఎగురవేసి టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జడ్పీటీసీలు పురమల్ల లలిత, పిట్టల కరుణ, ఎంపీపీలు పిల్లి శ్రీల , తిప్పర్తి లక్ష్మయ్య, కో ఆప్షన్ సభ్యులు సాబీర్ పాషా, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, మాజీ జిల్లా కో-ఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, కరీంనగర్, కొత్తపల్లి మండల అధ్యక్షులు కాసారావు శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి , దుర్షేడ్ ఫ్యాక్స్ చైర్మన్ బల్మూరి ఆనందరావు కాశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
China Education : ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి : మంత్రి హరీశ్‌రావు
Twin Towers: 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చేయండి : సుప్రీంకోర్టు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

