Climate Change | క్లైమేట్ చేంజ్‌తో కడుపులో బిడ్డపై ఎఫెక్ట్.. తక్కువ లేదా ఎక్కువ బరువుతో పుట్టే ఛాన్స్
వాతావరణ మార్పులు మనుషుల జీవన విధానంపైనే కాదు.. పుట్టుక మీద కూడా ప్రభావం చూపుతాయని తేలింది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో కలిగే వ్యత్యాసాలతో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.
- ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
- 20 % మంది పిల్లల్లో సమస్యలున్నట్టు వెల్లడి
Climate Change | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): వాతావరణ మార్పులు మనుషుల జీవన విధానంపైనే కాదు.. పుట్టుక మీద కూడా ప్రభావం చూపుతాయని తేలింది. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో కలిగే వ్యత్యాసాలతో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సుమారు 3.85 లక్షల మంది గర్భిణులపై పరిశోధనలు చేశారు. 2000 నుంచి 2015 మధ్య ఈ పరిశోధన జరిగింది. గర్భందాల్చడానికి 12 వారాల నుంచి బిడ్డ పుట్టే వరకు తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. ఇలా పుట్టిన బిడ్డల్లో దాదాపు 20 శాతం మంది బరువుల్లో వ్యత్యాసం ఉన్నట్టు తేల్చారు.
పరిశోధన కాలంలో గర్భిణులు నివసించిన వాతావరణ పరిస్థితులు, సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చితే కలిగిన వ్యత్యాసం, వాటివల్ల వారిలో కలిగే మానసిక ఒత్తిడి (బయో థర్మల్ స్ట్రెస్) వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం వారు ప్రపంచంలోనే మొదటిసారిగా ‘యూనివర్సల్ థర్మల్ ైక్లెమేట్ ఇండెక్స్’ను (యూటీసీఐ) ఉపయోగించారు. వాతావరణ పరిస్థితులకు శరీరం స్పందించే తీరును ఈ సూచీలో లెక్కిస్తారు.
వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతల్లో కలిగే వ్యత్యాసాలను ‘బయో ైక్లెమాటిక్ కండీషన్స్’ అంటారు. గర్భంతో ఉన్న సమయంలో బయో ైక్లెమాటిక్ కండీషన్స్‌కు లోనైనప్పుడు కలిగే ప్రతిస్పందనలను యూటీసీఐ ఆధారంగా లెక్కించారు. ఈ క్రమంలో వడగాడ్పులు, శీతల పవనాలు, వరదలు, కరువు ఇతర ప్రకృతి విపత్తులు వంటి పరిస్థితులు ఉన్నాయి. పుట్టిన బిడ్డల బరువును గణించగా.. పుట్టిన బిడ్డల్లో సుమారు 20 శాతం మంది సాధారణ బరువు కన్నా అతి తక్కువగానో, ఎక్కువగానో పుట్టినట్టు వారు గుర్తించారు. మొత్తం పిల్లల్లో 9.8 శాతం మంది తక్కువ బరువుతోనూ, 9.9 శాతం మంది అధిక బరువుతో ఉన్నట్టు నిర్ధారించారు.
‘పుట్టిన సమయంలో బిడ్డ బరువుకు, ఆరోగ్యానికి ఎంతో సంబంధం ఉంటుంది. నవజాత శిశుమరణాలు, బాల్యంలో అనారోగ్య సమస్యలు, పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి’ అని పరిశోధక బృంద సభ్యుడు డాక్టర్ సైల్వెస్టర్ డోజీ న్యాదను తెలిపారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల మధ్య పిండం ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

