TS DSC 2023 | 5089 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే దరఖాస్తులు.. మహిళలకు ఎక్కువ పోస్టులు ఉన్నది ఈ జిల్లాల్లోనే!
TS DSC 2023 | డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ విషయమై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికింది. రోస్టర్‌ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించింది. దీంతో కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది.
TS DSC 2023 | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ విషయమై విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఉద్యోగాలను కొత్త రోస్టర్ ప్రకారం నియమించాలని నిర్ణయించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో పాత రోస్టర్‌కు ముగింపు పలికింది. రోస్టర్‌ను 1వ పాయింట్ నుంచి ప్రారంభించింది. దీంతో కొత్త రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రోస్టర్‌ను మంగళవారం విద్యాశాఖ విడుదల చేసింది. పోస్టుల వారీగా రోస్టర్ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను ప్రకటించిన విషయం తెలిసిందే.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు మంగళవారం రాత్రి 12 గంటల నుంచే దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించారు. వచ్చే నెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానికసంస్థల బడుల్లో 5,089 పోస్టుల భర్తీకి గతంలో పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషాపండితులు, పీఈటీ పోస్టులున్నాయి.
మహిళలకు తక్కువ పోస్టులున్న జిల్లాలివే

టీచర్ పోస్టుల్లో 51% మహిళలకే
డీఎస్సీ ద్వారా భర్తీచేసే పోస్టుల్లో 51శాతం పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. అగ్రభాగం పోస్టులు వారికే దక్కాయి. ఇవే కాకుండా ఇక ఓపెన్ జనరల్ కోటాలోనూ వారు పోటీ పడే అవకాశం ఉన్నది. డీఎస్సీ ద్వారా భర్తీచేసే పోస్టుల రోస్టర్ రిజర్వేషన్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. 5,089 పోస్టులను భర్తీచేస్తుండగా, వీటిలో 2,638 పోస్టులు మహిళలకే కేటాయించారు. ఓపెన్ జనరల్ కోటాలో మరో 2,451పోస్టులను రిజర్వ్‌చేశారు. ఓపెన్ జనరల్ కోటా పోస్టుల్లో పురుషులతో పాటు, మహిళలు పోటీపడే అవకాశం ఉన్నది. ఈ పోస్టులను మెరిట్ అధారంగా భర్తీచేస్తారు. జిల్లాల వారీగా తీసుకొంటే 24 జిల్లాల్లో అత్యధిక పోస్టులు మహిళలకే రిజర్వ్ అయ్యాయి. హనుమకొండ జిల్లాలో 54 పోస్టుల్లో 40 పోస్టులు, పెద్దపల్లి జిల్లాలో 43 పోస్టులలో, 31 పోస్టులు మహిళామణులకే రిజర్వ్‌చేశారు. తక్కువ జిల్లాల్లోని పోస్టుల్లో మహిళలకే రిజర్వ్‌చేశారు. అదే అధిక పోస్టులున్న జిల్లాల్లో మాత్రం పూర్తి రోస్టర్ పాటించడంతో జనరల్ కోటా వాటా దక్కింది. ఇక ఎస్జీటీ పోస్టుల్లో తెలుగు మీడియం పోస్టులే అధికంగా ఉన్నాయి. మీడియం వారీగా తీసుకుంటే ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే ఎస్జీటీ ఇంగ్లిష్ మీడియం పోస్టులున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో బయాలజీ, సోషల్‌లో ఎక్కువ పోస్టులున్నాయి. పండిట్ పోస్టుల్లో తెలుగు పండిట్ పోస్టులు అధికంగా ఉన్నాయి.
మహిళలకు ఎక్కువ పోస్టులున్న జిల్లాలు..

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

