Government Hospitals | సర్కారు దవాఖానల్లో గోలీల్లేవ్.. తీవ్ర సంక్షోభంలో ప్రజావైద్యం!
రాష్ట్రంలో సర్కారు దవాఖానల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజావైద్యంపై ‘మందుల కొరత’ పిడుగులా మారింది.
- సీఎంఎస్‌లలో నిండుకుంటున్న నిల్వలు
- ముసురుతున్న సీజనల్ వ్యాధులు
- ఖాళీ అయిన యాంటి బయాటిక్స్
- ‘ఎసిడిటీ’ ట్యాబ్లెట్లూ కరువే
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సర్కారు దవాఖానల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజావైద్యంపై ‘మందుల కొరత’ పిడుగులా మారింది. వైద్యారోగ్యశాఖ ఔషధాల కొనుగోలును పట్టించుకోకపోవటంతో క్రమంగా ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు’ (సీఎంఎస్)లు ఖాళీ అవుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
జలుబు, దగ్గు, వాపు వంటి ప్రాథమిక వ్యాధులకు కూడా మందులు లేకపోవటం వైద్యారోగ్యశాఖ దీనస్థితికి అద్దం పడుతున్నది. సీఎంఎస్‌లు మందులను నిల్వచేసే గోదాములు. ఇక్కడి నుంచి వాటి పరిధిలోని దవాఖానలకు మందులు సరఫరా అవుతుంటాయి. రాష్ట్రంలోని 11 సీఎంఎస్‌లు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో మందుల నిల్వలు తాజాగా పరిశీలించగా విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి.
- సీపీఎం (Chlorpheniramine) ట్యాబ్లెట్లు సర్ది (జలుబు) చికిత్సకు వాడే సర్వసాధారణమైన ఔషధం. వర్షాకాలం వేళ వీటి వినియోగం ఎసెంటర్లలో నిల్వలు నిండుకున్నాయి.
- పాంటోప్రజోల్ (Pantoprazole) – దీనిని ఎసిడిటీకి విరుగుడుగా వాడుతుంటారు. ఇవి ఆదిలాబాద్ సీఎంఎస్‌లో తప్ప రాష్ట్రంలోని మరే సెంటర్లోనూ లేకపోవడం గమనార్హం. ఇక పాంటోప్రజోల్ ఇంజెక్షన్లు ఎక్కడా కనిపించటంలేదు. అంతేకాదు.. ఆంటాసిడ్ (Antacid) సిరప్లు, సుక్రల్ఫేట్ (Sucralfate) సిరప్లదీ ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని ఏ సీఎంఎస్లోనూ వీటి నిల్వలు లేకపోవటం బాధాకరం.
- అమాక్సిసిల్లిన్ + క్లావమ్ (Amoxicillin+Clavum) ఇంజెక్షన్లను ప్రాథమిక యాంటి బయాటిక్స్‌గా వాడుతుంటారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పెద్దఎత్తున అమాక్సిసిల్లిన్ ఇంజెక్షన్లు, సిరప్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం మెదక్ సీఎంఎస్‌లో 800 ఇంజెక్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిరప్లు ఎక్కడాలేవు. నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి.
- సెర్రాటియోపెప్టిడేజ్ (Serratiopepti dase) ను నొప్పి నివారణకు, వాపు రాకుండా వాడుతుంటారు. రాష్ట్రంలోని ఏ సీఎంస్లోనూ ఈ నిల్వలు లేవు.
- ఎవరి శరీరంలో అయినా ప్రమాదకర స్థాయిలో యాంటిబాడీల సంఖ్య తగ్గినప్పుడు ఇమ్యునోగ్లోబిన్ (Human Normal Immunoglobin) ఇంజెక్షన్లు ఇస్తుంటారు. ప్రస్తుతం ఇవి రాష్ట్రంలోని మూడు సీఎంఎస్‌లలో కలిపి 88 మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
- పీసీఎం ఇన్ఫ్యూజన్ (PCM Infusion) ను నొప్పి నివారణ కోసం వినియోగిస్తారు. రాష్ట్రంలోని ఏ సీఎంఎస్లోనూ వీటి నిల్వ లేదు.
- చివరికి.. ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా రెండు కేంద్రాల్లో 208 ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
- కంటి చికిత్సలో వినియోగించే సిప్రో క్కువగా ఉంటుంది. కానీ రాష్ట్రంలోని సీఎంఎస్‌లలో ఎంత నిల్వ ఉన్నయో తెలుసా? ‘0’ మాత్రమే. మొత్తం 11 ఐ డ్రాప్స్, చెవుల చికిత్సలో పనిచేసే జెంట్రా ఇయర్ డ్రాప్స్ కూడా సీఎంఎస్‌లలో నిండుకున్నాయి.
సీజనల్ వ్యాధుల వేళ..
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మందులు నిల్వ ఉంచుకోవాల్సింది పోయి ఖాళీ కావడంపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవటంతో రెండు, మూడు నెలల కిందటే సప్లయర్లు మందుల సరఫరాను నిలిపివేశారు. అదేంటని అడిగితే.. కేంద్రం ఎన్హెచ్ఎం నిధులు మంజూరు చేయలేదని, అందుకే మందులు కొనటం లేదని వింత సమాధానం ఇచ్చింది. అయితే ప్రతి దవాఖానలో కచ్చితంగా మూడు నెలలకు సరిపడా మందులు ఉండాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ మేరకు అన్ని దవాఖానల్లో మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉంచుతున్నారు. ప్రస్తుతం దవాఖానల్లో వాటితోనే నెట్టుకొస్తున్నారు. మరికొన్ని రోజుల్లో దవాఖానల్లో నిల్వలు అయిపోతాయని చెప్తున్నారు. అటు సీఎంఎస్ల్లో మందులు లేక, ఇటు దవాఖానల్లో మందులు లేకపోతే ప్రజావైద్యం సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

