TGSRTC | ప్రయాణికులపైనే ‘టోల్’ భారం.. సెస్సు పెంచేసిన టీజీఎస్ ఆర్టీసీ
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీల్లో టోల్ సెస్సు మరోసారి పెరిగింది. ఒక్కో టికెట్‌పై రూ.3 చొప్పున పెరిగిన టోల్ చార్జీలు ఇటీవలే అమల్లోకి వచ్చాయి.
- టోల్ రూట్లలో ఒక్కో టికెట్‌పై రూ.3 చొప్పున వసూలు
TGSRTC | హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీల్లో టోల్ సెస్సు మరోసారి పెరిగింది. ఒక్కో టికెట్‌పై రూ.3 చొప్పున పెరిగిన టోల్ చార్జీలు ఇటీవలే అమల్లోకి వచ్చాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10గా ఉన్న చార్జీని రూ.13 చొప్పున వసూలు చేస్తుండగా, డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర, బస్సుల్లో రూ.13 నుంచి రూ.16, గరుడ ప్లస్ బస్సుల్లో రూ.14 నుంచి రూ.17, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రీడ్ స్లీపర్ బస్సుల్లో రూ.15 నుంచి రూ.18, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.20 నుంచి రూ.23 చొప్పున టోల్ సెస్‌ను వసూలు చేస్తున్నారు.
హైవేలపై ఈ నెల 2 నుంచి బస్సుల్లో ప్రయాణించే పురుషులు మాత్రమే భరించాల్సి ఉంటుంది. నిత్యం 30 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. నగరంలో 12 లక్షల మంది, పల్లెవెలుగు బస్సుల్లో 12 లక్షల మంది చొప్పున ప్రయాణిస్తున్నారు. టోల్ సెస్ పెంపు భారం సుమారు 6 నుంచి 10 లక్షల మందిపై అదనపు భారం పడుతుందని అంచనా. ఈ పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.
పెరిగిన టోల్చార్జీతో ప్రయాణికులపై అదనపు భారం వేసిన ఆర్టీసీకి మాత్రం అదనపు ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో బస్సు సర్వీసుల వేళల్లోనూ ఆర్టీసీ అధికారులు మార్పులు చేశారు. టోల్‌చార్జీలు పెరిగినందున టికెట్లో టోల్‌చార్జీ పెరిగింది తప్ప.. టికెట్ రేటు కాదని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. సాధారణ చార్జీలు యథాతంధంగానే ఉన్నాయని,సాధారణ రూట్లలో టికెట్ చార్జీ ల్లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

