Short circuit | పెండ్లింట విషాదం.. కరంటు షాక్‌తో వివాహానికి ముందురోజే వరుడు మృతి
పెండ్లింట విషాదం నెలకొన్నది. వివాహానికి ఒక రోజు ముందు విద్యుత్తు షాక్‌తో వరుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం తండాలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా బాలాజీ-కాంతి దంపతులకు ఇద్దరు సంతానం.
- కరంటు షాక్‌తో కన్నుమూసిన యాకూబ్
Short circuit | మహబూబాబాద్ రూరల్, మే 11: పెండ్లింట విషాదం నెలకొన్నది. వివాహానికి ఒక రోజు ముందు విద్యుత్తు షాక్‌తో వరుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం తండాలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా బాలాజీ-కాంతి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్దకొడుకు యాకూబ్ (21) హైదరాబాద్‌లో రైల్వే కాంట్రాక్టర్ వద్ద పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల గార్ల మండలానికి చెందిన యువతితో వివాహం కుదిరింది.
పెండ్లి కోసం యాకూబ్ సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. శుక్రవారం పెండ్లి జరగాల్సి ఉండగా ఇంట్లో బంధువులతో సందడి నెలకొన్నది. గురువారం ఇంట్లో నీళ్లు అయిపోవడంతో బోర్ మోటర్ స్విచ్ వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై కిందపడ్డాడు. వెంటనే బంధువులు, స్థానికులు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. తెల్లారితే పెండ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

