Junior colleges | తెలంగాణలో జూనియర్ కళాశాలల విద్యాసంవత్సరం క్యాలెండర్ ఖరారు
Junior colleges | రాష్ట్రంలో జూనియర్ కళాశాలల (Junior Colleges) విద్యా సంవత్సరం (2024-25 ) క్యాలెండర్(Calendar)ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (Intermediate Board) ప్రకటించింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో జూనియర్ కళాశాలల (Junior Colleges) విద్యా సంవత్సరం (2024-25 ) క్యాలెండర్(Calendar)ను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (Intermediate Board) ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలలకు ఈ క్యాలెండర్ అమలు అవుతుందని స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి వెల్లడించారు.
అక్టోబర్ 6 నుంచి 13వ తేదీ వరకు దసరా(Dussehra) సెలవులు, నవంబర్ 18 నుంచి 23వ తేదీవరకు హాఫ్ ఇయర్స్ ఎగ్జామ్స్, 2025 జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి (Sankranthi) సెలవులుంటాయని తెలిపారు. జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి మొదటివారంలో ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి మొదటి వారం థియరీ పరీక్షలు జరుగుతాయని వివరించారు.
మార్చి 29వ తేదీన విద్యాసంవత్సరం క్యాలెండర్ ముగుస్తుందని పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 31 మార్చి నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

