TGSRTC : జాతీయ సదస్సుకు టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఆహ్వానం
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన్న డిమాండ్ పై
హైదరాబాద్, నవంబర్ 20 : కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ బస్సుల విధానంలో సంపూర్ణ మార్పులు చేసి ఆర్టీసీలకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ కు అవకాశం కల్పించాలని, ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్న డబ్బులు ఆర్టీసీలకే ఇవ్వాలన్న డిమాండ్ పై ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న చెన్నైలో జాతీయ సదస్సు జరుగనుంది. ఈ సదస్సుకు దేశంలోని 56 ఆర్టీసీల నుండి కార్మిక సంఘాల నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సుకు హాజరై అభిప్రాయాలు తెలుపాల్సిందిగా కోరుతూ టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఆహ్వానం అందజేసింది.
కాలుష్యం నియంత్రణ పేరుతో దేశంలో ఉన్న 1,40,000 ఆర్టీసీ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం చేసి అమలు చేస్తుంది. ఇప్పటికే Fame1, FAME-2, PME-Bus, PM e డ్రైవ్ పథకాలతో, పీపీపీ మోడల్లో జీసీసీ కాంట్రాక్ట్ పద్ధతిని అమలు చేస్తూ సబ్సిడీలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ నగరంలో 2 వేల బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలని విధాన నిర్ణయం చేసిన సంగతి తెలిసిందే.
ఈ విధానం వల్ల ఆర్టీసీలు మరింత నష్టాల ఊబిలోకి వెళ్తాయని, భవిష్యత్లో ఆర్టీసీ బస్సులు కనమరుగయ్యే ప్రమాదంతో పాటు, కొత్త ఉద్యోగాల కల్పన లేకపోవడమే కాక ప్రస్తుతం ఉన్న కార్మికుల ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడనున్నదని ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, వీ.ఎస్.రావులు అన్నారు. సంస్థ మనుగడకు, కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు వారు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AIRTWF
- citu
- electric buses
- SWF
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

