Achampet | అచ్చంపేటలో బాలింత మృతి.. పరిస్థితి ఉద్రిక్తం
అప్పుడే పుట్టిన ఐదు రోజుల పసికందుకు తల్లి దూరమైంది. ప్రసవం అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని భావిస్తున్న తరుణంలో బాలింత అనూహ్యంగా మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
అచ్చంపేట: అప్పుడే పుట్టిన ఐదు రోజుల పసికందుకు తల్లి దూరమైంది. ప్రసవం అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని భావిస్తున్న తరుణంలో బాలింత అనూహ్యంగా మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని భవాని ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంగళవారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే.. బల్మూరు మండలం పోలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన పద్మ అనే గర్భిణి ఐదు రోజుల క్రితం అచ్చంపేటలోని భవాని దవాఖానలో ఆపరేషన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసిన కొద్దిసేపటికే ఆమె కోమాలోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అనంతరం హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది కుటుంబ సభ్యులకు సరైన సమాచారం ఇవ్వకుండానే అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారని వారు చెబుతున్నారు. అక్కడ అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ పద్మ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో అచ్చంపేటకు తీసుకొచ్చి మంగళవారం ఉదయం భవాని హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు.
హాస్పిటల్ అద్దాలు ధ్వంసం
వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని పెద్ద సంఖ్యలో బంధువులు, గ్రామస్తులు హాస్పిటల్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అంబులెన్స్ ముందు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. మృతదేహాన్ని హాస్పిటల్ వద్దే ఉంచాలని పట్టుబట్టడంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆగ్రహానికి గురైన కొందరు కుటుంబ సభ్యులు తిరిగి హాస్పిటల్ వద్దకు చేరుకుని అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మరిన్ని దాడులు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Achampet | అచ్చంపేటలో బాలింత మృతి.. పరిస్థితి ఉద్రిక్తం
ఆస్తి కోసం దారుణం.. మహిళ తల, మొండెం వేరుచేసి హత్య!
AP News | పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధికార కూటమికే ఆధిక్యం..!
Jagtial Child | ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’.. వీడియో వైరల్.. చివరకు తల్లిదండ్రుల చెంతకు బాబు!
Ramayana | ‘రామాయణ’కు పైరసీ భయం.. కీలక ఆదేశాలు జారీ చేసిన ముంబై హైకోర్టు!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

