బీఆర్ఎస్ నేతల భూముల్లో యూట్యూబర్ దౌర్జన్యం
తనను తాను ముఖ్యమంత్రి రేవంత్ అనుచరుడిగా చెప్పుకొనే ఓ యూట్యూబర్ బీఆర్ఎస్ నేతలు, వారి బంధువుల ఇండ్లను టార్గెట్ చేశాడు. వారి పొలాలు, ఫాంహౌస్ల్లోకి అక్రమంగా ప్రవేశించి ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నాడు.
- పట్టుకుని దేహశుద్ధి చేసిన సిబ్బంది, స్థానికులు?
- నిరంజన్‌రెడ్డి బంధువుల ఫాంహౌస్‌లోకి చొరబడి వీడియోలు తీసిన కాంగ్రెస్ అనుకూల యూట్యూబర్
- పోలీసుల అదుపులో నిందితుడు కొడంగల్ నర్సింహ
- ఆయన నుంచే ఫిర్యాదు తీసుకొని, ఉల్టా బీఆర్ఎస్ నేతలపైనే కేసు పెట్టేలా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి
గద్వాల/ఎర్రవల్లి చౌరస్తా, అక్టోబర్ 19 : తనను తాను ముఖ్యమంత్రి రేవంత్ అనుచరుడిగా చెప్పుకొనే ఓ యూట్యూబర్ బీఆర్ఎస్ నేతలు, వారి బంధువుల ఇండ్లను టార్గెట్ చేశాడు. వారి పొలాలు, ఫాంహౌస్ల్లోకి అక్రమంగా ప్రవేశించి ఫొటోలు, వీడియోలు తీయడమే పనిగా పెట్టుకున్నాడు. బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు నిత్యం వీడియోలు సృష్టించే సదరు యూట్యూబర్.. చివరికి జనమే దేహశుద్ధి చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బంధువుల ఫాంహౌస్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన కొడంగల్ నర్సింహను పట్టుకున్న స్థానికులు.. వీపు సాపు చేసి, ఆయనను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటనలో నిందితుడికి బుద్ధి చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు.. ఉల్టా బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలేపల్లికి చెందిన య్యూటూబర్ నర్సింహ.. బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత వివరాలతోపాటు, వారి వ్యవసాయ క్షేత్రాల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి వీడియోలు తీసి తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నట్టు బీఆర్ఎస్ శ్రేణులు చాలారోజులుగా ఆరోపిస్తున్నాయి. సోమవారం నర్సింహ మానవపాడు మండలం చండూరు దగ్గర ఉన్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బంధువుల వ్యవసాయ క్షేత్రంలోకి ప్రవేశించి అక్కడ వారు సాగు చేస్తున్న పామాయిల్ తోటతోపాటు అక్కడ ఉన్న ప్రదేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సిబ్బంది కంటపడ్డాడు. స్థానికుల సాయంతో వారు అతడిని పట్టుకునే క్రమంలో పారిపోయాడు. బీచుపల్లి సమీపంలోని తిమ్మాపూర్ దగ్గరలోగల ఓ ఉడిపి హోటల్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి చేరుకొని అతడిని ప్రశ్నించారు. సరైన సమాధానం రాకపోగా, ఉల్టా దౌర్జన్యానికి దిగడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులూ అక్కడికి వచ్చి యూట్యూబర్‌కు మద్దతుగా నిలిచారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగే అవకాశం ఉన్నదని భావించిన పోలీసులు యూట్యూబర్‌ను ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పైనుంచి ఏ ఒత్తిళ్లు పనిచేశాయో తెలీదుగానీ.. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నాయకులను వదిలపెట్టిన పోలీసులు.. బీఆర్ఎస్ నాయకులను మాత్రం కోదండాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫామ్‌హౌస్, పొలంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయకుండా, అతడి నుంచే ఫిర్యాదు తీసుకున్నట్టు సమాచారం. వనపర్తికి చెందిన మాజీ మంత్రిని నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు యూట్యూబర్‌ను ఇలాంటి కుట్ర పూరిత చర్యలకు ప్పాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై ఇటిక్యాల ఎస్సై రవిని వివరణ కోరగా యూట్యూబర్ తమ ఆధీనంలో ఉన్నాడని, అతడి నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి గద్వాల డీఎస్పీ మొగులయ్యను సంప్రదించగా.. జరిగిన ఉదంతం తన దృష్టికి రాలేదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

