కేంద్ర ఉద్యోగాల్లో తెలుగుకు ప్రాధాన్యమివ్వాలి

- హిందీ రుద్దుడుతో తెలుగు రాష్ర్టాలకు అన్యాయం
- జోనల్ విధానాన్ని పునరుద్ధరించాలి
- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎంపిక ప్రక్రియలో తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ కోరారు. ఆయా ఉద్యోగాల ఎంపికలో హిందీని బలవంతంగా రుద్దడంతో తెలుగు రాష్ర్టాల విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో తెలుగు సహా 22 ప్రాంతీయ భాషలను అధికారికంగా గుర్తించిన విషయాన్ని ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కేంద్ర ఉద్యోగాల ఎంపికలో జోనల్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా జోనల్ ఎంపిక విధానాన్ని పక్కనపెట్టడం సరికాదని పేర్కొన్నారు. కేంద్రం విధానం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నదని అభిప్రాయపడ్డారు. కేంద్రం పరిధిలోని రైల్వే, పోస్టల్, పబ్లిక్వర్స్, సెంట్రల్ సెక్రటేరియట్, పబ్లిక్‌సెక్టార్ బ్యాంకులు, కంపెనీలు, రక్షణశాఖ, సెంట్రల్ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ఐఐటీలు, నిట్, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, ఎయిర్పోర్ట్ అథారిటీ సహా పలు సంస్థలలో ఉద్యోగాల ఎంపికలో హిందీ బదులు తెలుగును కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

