ఆగమేఘాల మీద పైప్‌లైన్‌కు మరమ్మతులు
కొడంగల్‌లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ‘సీఎం నియోజకవర్గంలో రోడ్డెక్కిన మహిళలు’ శీర్షికన ప్రచురితమైన ఫొటోవార్తకు అధికారులు తక్షణమే స్పందించారు.
- సీఎం ఇలాకాలో రోడ్డెక్కిన మహిళలు
- సింగిల్‌ఫేజ్ మోటర్‌కు స్టార్టర్బిగింపు
మద్దూర్ (కొత్తపల్లి), ఏప్రిల్ 3 : కొడంగల్‌లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’లో బుధవారం ‘సీఎం నియోజకవర్గంలో రోడ్డెక్కిన మహిళలు’ శీర్షికన ప్రచురితమైన ఫొటోవార్తకు అధికారులు తక్షణమే స్పందించారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం వాల్యానాయక్ తండాలో ప్రధాన పైప్‌లైన్ మరమ్మతులకు నోచుకోవడంలేదని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో బుధవారం మిషన్ భగీరథ అధికారులు హుటాహుటిన తండాకు చేరుకొని పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టారు.
గ్రామంలోని సింగిల్‌ఫేజ్ మోటర్‌కు సంబంధించి స్టార్టర్‌ను బిగించారు. అంతేగాక మద్దూర్ ఎంపీడీవో కార్యాలయంలో తాగునీటి సమస్యపై పంచాయతీ సెక్రటరీ, ప్రత్యేక అధికారులతో కొడంగల్ డెవలప్మెంట్ ఏరియా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మద్దూర్ మండలంలో ఎక్క డా తాగునీటి సమస్యలు తలెత్తకూడదని ఆదేశించారు. పాత బోర్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. ఎస్డీఎఫ్ నిధులతో వేయించిన బోర్లల్లో వెంటనే మోటర్లు దింపాలని, 24 గంటల్లో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

